పోషకాహార
లోపం వల్లగానీ, దీర్ఘకాలంగా ఉంటున్న అనేక వ్యాధుల వల్లగానీ నరాలు
శక్తిహీనమవుతాయి. ఆ క్రమంలో మరికొన్ని ఇతర సమస్యలు కూడా మొదలవుతాయి.
ఆల్కహాల్, పొగ, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా ఆయా సమస్యలు
తలెత్తుతాయి. ఆయా సమస్యలను బట్టి హోమియో మందులు వేసుకుంటే శక్తివంతంగా
పనిచేస్తాయి.
- నరాల బలహీనత వల్ల ఏర్పడుతున్న నిద్ర లేమి, నీరసం, గుండె దడ వంటి లక్షణాలు ఉన్నవారు అవీనా సతైవా- క్యూ మందులు వేసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది.
- నీరసంతో ఏ పనీ చేయలేకపోవడం, ఆత్మీయులు దూరం కావడం వల్ల కలిగే వ్యధతో నీరసించడం వంటి సమస్యలు ఉంటే, యాసిడ్ ఫాస్-30 మందు బాగా పనిచేస్తుంది.
- తలనొప్పి, వెన్నుపోటు, అలసట, ఆకలి మందగించడం, మగత ఉంటే విక్రిక్ యాసిడ్ - 30 వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
- ఆడవాళ్లల్లో తరచూ వచ్చే నడుము నొప్పి, నిస్సత్తువ, ఏ చిన్నపని చేసినా అలసట ఉంటే ల్యాంకేసిస్- 30 మందు వేసుకోవడం ఎంతో బెటర్.
- మానసిక, శారీరక నీరసానికి,, నిస్సత్తువకూ కాలీఫాస్ - 30 వేసుకోవడం మిక్కిలి ప్రయోజనకరం.
1 comment:
Good Post... Ayurveda Hospital in Kerala!
Post a Comment