Tuesday, December 31, 2019

పోషకాహార లోపం వల్లగానీ, దీర్ఘకాలంగా ఉంటున్న అనేక వ్యాధుల వల్లగానీ నరాలు శక్తిహీనమవుతాయి. ఆ క్రమంలో మరికొన్ని ఇతర సమస్యలు కూడా మొదలవుతాయి. ఆల్కహాల్‌, పొగ, కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల కూడా ఆయా సమస్యలు తలెత్తుతాయి. ఆయా సమస్యలను బట్టి హోమియో మందులు వేసుకుంటే శక్తివంతంగా పనిచేస్తాయి.
 
  • నరాల బలహీనత వల్ల ఏర్పడుతున్న నిద్ర లేమి, నీరసం, గుండె దడ వంటి లక్షణాలు ఉన్నవారు అవీనా సతైవా- క్యూ మందులు వేసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది.
  • నీరసంతో ఏ పనీ చేయలేకపోవడం, ఆత్మీయులు దూరం కావడం వల్ల కలిగే వ్యధతో నీరసించడం వంటి సమస్యలు ఉంటే, యాసిడ్‌ ఫాస్‌-30 మందు బాగా పనిచేస్తుంది.
  • తలనొప్పి, వెన్నుపోటు, అలసట, ఆకలి మందగించడం, మగత ఉంటే విక్రిక్‌ యాసిడ్‌ - 30 వేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
  • ఆడవాళ్లల్లో తరచూ వచ్చే నడుము నొప్పి, నిస్సత్తువ, ఏ చిన్నపని చేసినా అలసట ఉంటే ల్యాంకేసిస్‌- 30 మందు వేసుకోవడం ఎంతో బెటర్‌.
  • మానసిక, శారీరక నీరసానికి,, నిస్సత్తువకూ కాలీఫాస్‌ - 30 వేసుకోవడం మిక్కిలి ప్రయోజనకరం.